Nayanthara: Beyond the Fairytale | లేడి సూపర్ స్టార్ నయనతార గురించి పత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ సమయంలోనే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్గా బాలీవుడ్లో ఎంట్రీతోనే షారుఖ్ జవాన్ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. అయితే ఈ భామపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ డాక్యూమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
నయనతార: బియాండ్ ది ఫేరిటెల్ (Nayanthara: Beyond the Fairytale) అంటూ ఈ డాంక్యూమెంటరీ రాబోతుండగా.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. నయనతార మూవీ కెరీర్‌తో పాటు తన జీవితంలో జరిగిన సంఘటనలు. విగ్నేష్‌తో వెడ్డింగ్ తదితర విషయాలను ఈ డాక్యూమెంటరీ వెల్లడించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ డాక్యూనీ నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
సినిమాల విషయానికి వస్తే.. నయనతార ప్రస్తుతం ‘మూకుత్తి అమ్మన్ 2’(Mookuthi Amman 2)లో నటించబోతున్నట్లు సమాచారం. 2020 లాక్డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘మూకుత్తి అమ్మన్’(Mookuthi Amman) సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది.