Prabhas | ఆ ఘనత ప్రభాస్‌కు మాత్రమే సాధ్యం
దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న సూపర్స్టార్లలో ఒకరిగా అవతరించారు ప్రభాస్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి నిన్నమొన్నటి ‘కల్కి 2898ఏడీ’ వరకూ ఆయన నటించిన ప్రతి సినిమా, వందలకోట్ల వసూళ్లను రాబడుతూ ప్రభాస్ స్టామినాను తెలియజేస్తూనే ఉంది.
Prabhas | దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న సూపర్స్టార్లలో ఒకరిగా అవతరించారు ప్రభాస్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి నిన్నమొన్నటి ‘కల్కి 2898ఏడీ’ వరకూ ఆయన నటించిన ప్రతి సినిమా, వందలకోట్ల వసూళ్లను రాబడుతూ ప్రభాస్ స్టామినాను తెలియజేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్న ‘ఆదిపురుష్’ సైతం దాదాపు 450కోట్ల వసూళ్లను రాబట్టిందంటే ప్రభాస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన ‘బాహుబలి 2’ 1800కోట్ల వసూళ్లతో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇప్పటికీ ఆ రికార్డును అందుకునే సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన జెట్ వేగంతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’, హను రాఘపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, మరోవైపు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’, ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ ‘సలార్ 2’. ఇక నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ ఇలాగూ ఉంది. వీటిలో కొన్ని షూటింగ్ దశలో ఉంటే.. కొన్ని ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఇదిలావుంటే.. ఈ వేగాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రభాస్ అడుగులేస్తున్నారు. కన్నడ సినీరంగంలో పేరెన్నికగన్న ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పటికే వారు నిర్మిస్తున్న ‘సలార్ 2’లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ‘హోంబలే’ నుంచి వచ్చే మరో రెండు సినిమాల్లో ఆయన నటించేందుకు ఒప్పందం కుదిరింది. ఆ సినిమాలేంటి? దర్శకులెవరు? తదితర అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయిదు సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా, మరో రెండు సినిమాలకు ప్రభాస్ సైన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

