అబద్ధం అన్న ప్రాతిపదిక మీదనే ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ధర్మం ఆధారంగా కాకుండా… అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను మరిచిపోయారని, కేవలం అబద్ధాల ప్రాతిపదికనే ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శుక్రవారం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుణ్ని దర్శించుకున్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ గతంలో హామీ ఇచ్చారని, యువకులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే.. తమ పార్టీ ఇందుకు పూర్తి భిన్నమని, చెప్పే మాటల్లో, చేసే పనుల్లో ఏకత్వం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇందుకు చత్తీస్గఢ్లో ఇచ్చిన హామీలను పేర్కొన్నారు.