Rahul Gandhi | రాహుల్‌గాంధీ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కూ నో పర్మిషన్
Rahul Gandhi | రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహులగాంధీ వెళ్లగా అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహులగాంధీ వెళ్లగా అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు. దాంతో కార్యకర్తలతో కలిసి ఆయన బైఠాయించారు.
అనంతరం రాహుల్‌గాంధీ షెడ్యూల్ ప్రకారం మోరిగావ్ జిల్లాలో పాదయాత్రకు ఉపక్రమించారు. కానీ పాదయాత్రకు జిల్లా అధికార యంత్రాంగం బ్రేకులు వేసింది. అదేవిధంగా ఇవాళ సాయంత్రం బిహుతోలిలో నిర్వహించతలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు కూడా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందునే తాము రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో అసోం ప్రజలు తన యాత్రలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. అంతకుముందు నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడుల్లోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. కాగా, అసోంలోని 17 జిల్లాల మీదుగా 833 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

