Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జాతికి చెందిన ఓ శునకం రాహుల్‌తో కలిసి కాసేపు నడిచి అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
కాగా, బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ గత సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో రాహుల్‌గాంధీ యాత్ర ముగిసింది.
Congress MP Rahul Gandhi walks with a dog during Bharat Jodo Yatra as it marches ahead in Haryana's Karnal
(Source: Congress) pic.twitter.com/Dg0IloroKK
— ANI (@ANI) January 7, 2023