న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో జైలుశిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ ఇవాళ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. లోక్‌సభ సభ్యుడిగా ఎంపికైన సమయంలో రాహుల్‌గాంధీకి కేంద్ర ప్రభుత్వం 12 తుగ్లక్ లేన్‌లో ఒక బంగ్లాను కేటాయించింది. ఇప్పుడు ఎంపీ పదవిని కోల్పోవడంతో బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. దాంతో ఆయన ఇవాళ తన బంగ్లా నుంచి సామాగ్రిని తీసుకెళ్లారు.
12 తుగ్లక్ లేన్‌లోని తన అధికారిక బంగ్లా నుంచి 10 జనపథ్ రోడ్డులో ఉన్న ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసానికి డీసీఎం వ్యాన్ల ద్వారా సామాగ్రిని తరలించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీ ట్విటర్లో పోస్టు చేసింది.
కాగా, సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిపేరుపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. సూరత్ కోర్టు ఈ కేసు విచారణ జరిపి.. ఇటీవల రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. తీర్పుపై పైకోర్టుకు వెళ్లేందుకు ఒక నెల గడువు ఇచ్చింది. శిక్ష పడటంతో లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసింది.
#WATCH | Trucks from Congress leader Rahul Gandhi’s 12 Tughlak Lane bungalow leave for his mother and UPA chairperson, MP Sonia Gandhi’s residence at 10 Janpath.
He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/t4gANaLaRm
— ANI (@ANI) April 14, 2023
#WATCH | Trucks from Rahul Gandhi’s 12 Tughlak Lane bungalow, carrying his belongings, arrive at the residence of UPA chairperson and Congress MP Sonia Gandhi’s 10 Janpath residence in Delhi.
He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/UNqJvPi7Bg
— ANI (@ANI) April 14, 2023