Farting | భారతీయులు చాలా మంది గ్యాస్ సమస్యను ఎదుర్కొంటుంటారు. వాస్తవానికి పొట్ట ఉండడం అనేది మన జీన్స్‌లోనే ఉంది. అందుకనే చాలా మందికి గ్యాస్ వస్తుంది. అయితే ఈ సమస్య కేవలం పొట్ట ఉన్నవారిలోనే వస్తుందని అనుకుంటే పొరపాటు పడినట్లే. గ్యాస్ సమస్య అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఏర్పడవచ్చు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అతిగా ఆహారం తినడం, పప్పు దినుసులు లేదా ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, మటన్ వంటివి అధికంగా తినడం, వేళ తప్పించి భోజనం చేయడం, శీతల పానీయాలను అధికంగా తాగడం వంటి కారణాల వల్ల చాలా మందికి గ్యాస్ వస్తుంది. అలాగే పొట్ట ఉన్నవారికి కూడా గ్యాస్ ఎక్కువగా వస్తుంది. ఈ క్రమంలోనే కొందరికి గ్యాస్‌తోపాటు వెనుక నుంచి కూడా అపాన వాయువు రిలీజ్ అవుతుంటుంది. అయితే ఈ విధంగా వెనుక నుంచి గ్యాస్ వస్తే చాలా మంది తమకు ఆరోగ్యం బాగాలేదని అనుకుంటారు. కానీ ఇలా వెనుక నుంచి గ్యాస్ రిలీజ్ అవడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా అసిడిటీ వల్ల వచ్చే గ్యాస్ అయితే తగ్గిపోతుంది కానీ, పైన చెప్పిన విధంగా సహజంగా వచ్చే గ్యాస్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే అలా వెనుక నుంచి గ్యాస్ రావడం వల్ల మన ఆరోగ్యానికి మంచే జరుగుతుందని చెబుతున్నారు. అయితే బాగా ఘాటైన వాసనతో ఎక్కువ సార్లు గ్యాస్ వస్తుంటే దాన్ని అనారోగ్యానికి సూచన అని భావించాలి. అంతేకానీ రోజులో ఎప్పుడో ఒక సారి వస్తే దాంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బాగా తిన్నప్పుడు మనకు వెనుక నుంచి గ్యాస్ వస్తుందని తెలుసు కదా. అయితే అలా తిన్నప్పుడు సహజంగా ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం వల్లే అలా గ్యాస్ వస్తుంది. దీంతో మనం దిగులు చెందాల్సిన పనిలేదు. కొంత సేపు ఉండగానే ఆ గ్యాస్ తగ్గిపోతుంది. మనం తిన్న ఆహారం మొత్తాన్ని జీర్ణం చేసే పనిలో శరీరం పెద్ద మొత్తంలో నీటిని తన వద్ద ఉంచుకుంటుంది. అందుకే గ్యాస్ రిలీజవుతుంది. కనుక ఇలా తిన్నప్పుడు వెనుక నుంచి గ్యాస్ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అయితే దుర్వాసనతో కూడిన గ్యాస్ వెనుక నుంచి వస్తే మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా లేదని చెప్పేందుకు సూచన అని వైద్యులు చెబుతున్నారు. బాగా ఎక్కువగా జంక్ ఫుడ్, మాంసం తినేవారికి దుర్వాసనతో కూడిన గ్యాస్ వస్తుంది. అసలు గ్యాస్ రాకపోయినా అది అనారోగ్యానికి సంకేతమేనని అంటున్నారు. ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా తినకుంటే గ్యాస్ సరిగ్గా రాదు. దీంతో ఇతర జీర్ణ సంబంధ అనారోగ్యాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అసలు గ్యాస్ రాకుంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినండి. దీంతో గ్యాస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇక బక్క పలుచగా ఉన్న వారికే ఎక్కువగా గ్యాస్ వస్తుంది. అందుకే అలా ఉన్నవారే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. లావుగా ఉన్న వారికి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ వస్తుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి గ్యాస్ వస్తుంది. అది లావుగా ఉన్న వారికి మేలు చేస్తుంది.
నలుగురిలో ఉన్నప్పుడు కొంత మంది వెనుక నుంచి గ్యాస్ వస్తుందంటే దాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అలా ఆపుకోకూడదు. ఎందుకంటే గ్యాస్‌ను బయటకు రానీయకుండా ఆపితే అది పేగుల్లో చిక్కుకుని పేగులు వాపులకు గురవుతాయి. కనుక గ్యాస్ వస్తుందంటే దాన్ని ఆపుకోవద్దు. గ్యాస్‌ను వెనుక నుంచి ఎప్పటికప్పుడు బయటికి వదులుతుంటే శరీరం బాగా రిలాక్స్ అవుతుంది. దీంతో టెన్షన్, ఒత్తిడి వంటివి కూడా పోతాయి. కాబట్టి వెనుక నుంచి ఆ గ్యాస్ వచ్చిందంటే ఆపుకోవద్దు, వెంటనే విడుదల చేయాలి.