మాగనూరు : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు, కృష్ణ, మండలాలలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ( SP Dr. Vineeth ) తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు ( Cell Phones ) తీసుకురావద్దని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి , రెండో విడత పోలింగ్ల సమయంలో ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకురావడం వల్ల వాటిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకపోవడంతో, అత్యవసరంగా బయట ఉన్న వ్యక్తులకు సెల్ఫోన్లు అప్పగించగా కొన్ని మిస్సయ్యాయని తెలిపారు. అటువంటి పరిస్థితి పునరావృతకం కాకుండ ఉండడానికి సెల్ఫోన్లు అనుమతించడం లేదన్నారు.
మూడో విడత పోలింగ్‌కు వచ్చే ఓటర్లు పోలింగ్ కేంద్రాల పరిధిలోకి సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు తదితర నిషేధిత వస్తువులు తీసుకురావద్దని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా, ఇన్సిడెంట్ ఫ్రీగా పోలింగ్ పూర్తి చేయడమే జిల్లా పోలీసుల లక్ష్యమని ఎస్పీ వివరించారు.