Lionel Messi : భారత్‌లో పర్యటిస్తున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi), అతడి బృందం అభిమానుల ప్రేమకు పులకించిపోతున్నారు. ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భారత్‌లో అడుగుపెట్టినా మెస్సీ టీమ్‌కు అడుగడుగనా జననీరాజనం లభించింది. మూడో రోజు ఢిల్లీలో అపూర్వ స్వాగతం అనంతరం అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో ఫ్యాన్స్‌ను అలరించాడు మెస్సీ. టీ20 ప్రపంచకప్ టికెట్ విడుదల చేసిన తర్వాత.. భారీగా తరలివచ్చిన అభిమానలను ఉద్దేశించి ఫుట్‌బాల్ ఐకాన్ మాట్లాడాడు. తాము మరోసారి భారత్‌కు వస్తామని, అప్పుడు కచ్చితంగా క మ్యాచ్ ఆడుతామని మాటిచ్చాడీ సాకర్ లెజెండ్.
అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులకు అభివాదం తర్వాత మెస్సీ మైక్ అందుకున్నాడు. ఈ మూడు రోజులు భారత పర్యటనలో తమకు లభించిన స్వాగత సత్కారాలకు ఫిదా అయిపోయామని చెప్పాడతడు. ‘గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా వచ్చిన మా బృందానిపై మీరు చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరిని కలవడం నాకు మర్చిపోలేని అనుభవం. మా పర్యటన తక్కువ రోజులే అయినప్పటికీ.. వేగంగా పూర్తైనప్పటికీ మీ నుంచి అంతులేని ప్రేమ మాకు లభించింది.
VIDEO | Delhi: Argentine footballer Lionel Messi addresses the gathering at Arun Jaitley Stadium.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/NGXVwNLaGf
— Press Trust of India (@PTI_News) December 15, 2025
నాపై మీకు ఎనలేని అభిమానం ఉందని తెలుసు. కానీ.. ప్రత్యక్షంగా చూడడం చాలా గొప్పగా అనిపించింది. గోట్ ఇండియా టూర్ 2025లో భారతీయులు మాకు స్వాగతం పలికిన తీరు.. మాకోసం స్టేడియాలకు పోటెత్తడం చాలా క్రేజీగా తోచింది. మీరు చూపించిన ప్రేమను మా వెంట తీసుకెళ్తున్నాం. మేము కచ్చితంగా తిరిగొస్తాం. ఏదో ఒకరోజు.. ఏదో ఒక సందర్భంలో మీకోసం మ్యాచ్ ఆడుతాం. మరోసారి చెబుతున్ను.. మేము తప్పనిసరిగా భారత్‌కు మళ్లీ వస్తాం. అందరికీ కృతజ్ఞతలు’ అని మెస్సీ ఒకింత ఉద్వేగంగా మాట్లాడాడు.
Argentina’s #LionelMessi at the Arun Jaitley Stadium, New Delhi, during his GOAT tour of India during the Meet and Greet session.
📸 @Sushil_Verma9 pic.twitter.com/5MzSlL2oR7
— The Hindu (@the_hindu) December 15, 2025