BSNL | బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్.. రూ.997తో ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీ..!
BSNL | ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు మొబైల్ రీఛార్జ్ (Mobile recharge) ధరలను పెంచుతున్న తరుణంలో ప్రభుత్వ రంగ టెలికామ్ దిగ్గజం (Telecom company) బీఎస్ఎన్ఎల్ (BSNL) బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ తీసుకొచ్చింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చవకైన, దీర్ఘకాలిక ప్లాన్లలో ఒకటిగా నిలుస్తున్న రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తోంది.
BSNL : ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు మొబైల్ రీఛార్జ్ (Mobile recharge) ధరలను పెంచుతున్న తరుణంలో ప్రభుత్వ రంగ టెలికామ్ దిగ్గజం (Telecom company) బీఎస్ఎన్ఎల్ (BSNL) బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ తీసుకొచ్చింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చవకైన, దీర్ఘకాలిక ప్లాన్లలో ఒకటిగా నిలుస్తున్న రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తోంది.
రూ.997 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే దాదాపు ఐదు నెలలపాటు మళ్లీ రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ కింద రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతోపాటు, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా లభిస్తాయి.
రోజువారీ 2 జీబీ డేటా పరిమితి ముగిసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లు 28 నుంచి 84 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందిస్తున్నాయి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలంటే వినియోగదారులు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది.
ఈ బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్లాన్‌ను రోజువారీగా లెక్కిస్తే కేవలం రూ.6.64 ఖర్చు మాత్రమే అవుతుంది. ఇది దీర్ఘకాలిక ప్లాన్లలో అత్యంత చవకైన వాటిలో ఒకటిగా చెప్పవచ్చు. తరచుగా రీఛార్జ్ చేయడం ఇష్టంలేని వాళ్లు, తమ నంబర్‌ను తక్కువ ఖర్చుతో యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

