Priyanka Gandhi : వాయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ.. తన సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి రోడ్ షో నిర్వహించింది. వాయనాడ్ లోక్‌సభ స్థానంలోని కల్పెట్ట పట్టణంలో ఈ రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షోలో ప్రియాంకాగాంధీకి మద్దతుగా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వాహనంపై అభివాదం చేస్తూ వెళ్తుంటే జనం నీరాజనం పట్టారు.
#WATCH | Kerala: Congress general secretary Priyanka Gandhi Vadra shares a candid moment with a young girl during her roadshow ahead of filing nomination for Wayanad Lok Sabha by-elections shortly.
Her brother and Lok Sabha LoP Rahul Gandhi, her husband Robert Vadra and her son… pic.twitter.com/dqm58zkQcD
— ANI (@ANI) October 23, 2024
ఈ రోడ్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నేతలు ప్రియాంకాగాంధీ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ప్రారంభానికి ముందు ప్రియాంకాగాంధీ స్థానికంగా ఉన్న రిసార్టులో స్థానిక కాంగ్రెస్ నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీతోపాటు వాయనాడ్‌లో పోటీ చేసిన రాహుల్‌గాంధీ రెండు చోట్ల విజయం సాధించారు.
దాంతో ఆయన వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో తన సోదరి ప్రియాంకాగాంధీ బరిలో దిగుతుందని నియోజకవర్గ ప్రజలకు రాహుల్‌గాంధీ మాటిచ్చారు. ఆ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంకాగాంధీని వాయనాడ్ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20 పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడించనున్నారు.