భాగల్పూర్: లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అని కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఆరోపించారు. ఆదివారం మీడియతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత్లోని సిక్కుల పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేర్పాటువాదుల మద్దతు ఇప్పుడు రాహుల్కు లభించిందని, సిక్కులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను వేర్పాటువాదులు, మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ ప్రశంసిస్తున్నారని చెప్పారు. అందువల్ల ఆయన మన దేశానికి నంబర్ వన్ టెర్రరిస్ట్ అని, కాబట్టి ఆయనను పట్టుకున్నవారికి బహుమతి ప్రకటించాలన్నారు. బిట్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.