(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : నీట్-యూజీ పరీక్ష రద్దుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నీట్ లీకేజీ దేశ యువతపై జరిగిన నేరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్తున్న అమృత కాలం.. దేశానికి విష యుగంగా మారిందన్నారు.
డీఎంకే చీఫ్ స్టాలి న్ స్పందిస్తూ.. నిర్వాహణ ప్రక్రియలో ప్రతి దశలోనూ మోసం కనబడుతున్నదన్నారు. విద్యార్థులు పెద్దయెత్తున ఉద్యమించాలని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీలతో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటున్నదని సీపీ ఎం ఆందోళన వ్యక్తం చేసింది.