రాహుల్ ఓ ఫేక్ గాంధీ : కేంద్రమంత్రి
Rahul is Fake Gandhi | ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్

లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఫేక్ గాంధీ అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ కలలను బీజేపీ నేతృత్వంలోని సాకారం చేస్తుందన్నారు.
మహాత్ముడి కలలను సాకారం చేసేందుకు బీజేపీ, యోగి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఏడు విడుతల్లో ఎన్నికలో జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న పోలింగ్ జరుగనున్నది. రెండో విడుత ఫిబ్రవరి 14న, 20న మూడు, 23న నాల్గో విడుత, 27న ఐదో విడుత పోలింగ్ జరుగనున్నది. మార్చి 3, 7 తేదీల్లో ఆరు, ఏడో విడుద పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీని ఓ హిందుత్వ వాది చంపేశాడని పేర్కొన్నారు. హిందుత్వవాదులు అందరూ ఆయన ఇక లేరని విర్రవీగుతున్నారని, కానీ, సత్యం ఎక్కడైతో ఉంటుందో అక్కడ ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటారని ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీని 1948లో ఇదే రోజున నాథురాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతినే మార్టిర్స్ డేగా దేశం పాటిస్తున్నది. రాహుల్ గాంధీ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

