రాంచీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బెయిల్ మంజూరీ చేసింది జార్ఖండ్ కోర్టు. 2018లో కేంద్ర మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇవాళ కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. జార్ఖండ్‌లోని వెస్ట్ సింగభుమ్ జిల్లాలో ఉన్న చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10.55 నిమిషాలకు ఆయన కోర్టుకు వెళ్లారు. కేంద్ర మంత్రి షాపై వ్యాఖ్యలు చేసిన ఘటనలో ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కేసు బుక్ చేశారు.
వాస్తవానికి రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో ఇవాళ శిబూ సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి ఉంది. రాంచీకి చేరుకున్న తర్వాత ఆయన వెళ్లాల్సిన హెలికాప్టర్ మొరాయించింది. దీంతో శిబూ సోరెన్ అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. కేంద్ర మంత్రి షాను అవమానించే రీతిలో రాహుల్ వ్యాఖ్యలు చేసినట్లు తన ఫిర్యాదులో ప్రతాప్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కేసులో జూన్ 26వ తేదీన హాజరుకావాలని స్పెషల్‌కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జార్ఖండ్ హైకోర్టులో అభ్యర్థన చేయడంతో కేసును ఆగస్టు 6వ తేదీకి బదిలీ చేశారు.