బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాఖ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిలు మంజూరైంది. రూ.75 లక్షల పూచీకత్తును సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఆయనను ఆదేశించింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్లకు కూడా ఈ నెల 1న బెయిలు మంజూరు చేసింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు, ‘40 పర్సెంట్ సర్కారు’ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఇచ్చారని బీజేపీ ఈ కేసు దాఖలు చేసింది.