లక్నో, సెప్టెంబర్ 13: రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీని వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. రాహుల్ తన పర్యటనలో భాగంగా ఇటీవల జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాహుల్ గాంధీ మొదట యూపీ మంత్రిని ఏదైనా చెప్పాలనుకొంటే ముందుగా అడగాలని.. ఆ తర్వాత ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ& ‘మీరు లోక్‌సభ స్పీకర్ మాటే వినరు. అలాంటిది మీ మాటలను నేను ఎలా వింటాను’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది.