న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతున్నది. చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలకు చేరగా.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ప్రధాని మోదీయే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రూపాయి విలువ పతనంపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రసంగాన్ని ఆయనకు గుర్తు చేశారు.
ఇవి మీ సొంత మాటలు, మీరు ప్రధాని కాదా? అప్పట్లో మీరు చేసిన వ్యాఖ్యలు.. నేడు రూపాయి విలువ వేగంగా పడిపోవడం చూసి మౌనంగా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 2014కి ముందు నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు రూపాయి విలువ క్షీణించిన సమయంలో యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసిందంటూ పలువురు నేతలు సోషల్ మీడియాలో ఆరోపించారు. రూపాయి పతనాన్ని ఆపకపోవడం వల్లే ప్రభుత్వం మొత్తం విశ్వసనీయతను కోల్పోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా అన్నారు.
“देश निराशा की गर्त में डूबा है”
ये आपके ही शब्द हैं ना, प्रधानमंत्री जी?
उस वक़्त आप जितना शोर मचाते थे, आज रूपए की कीमत तेज़ी से गिरती देखकर उतने ही ‘मौन’ हैं। #अबकी_बार_80_पार pic.twitter.com/i9RHSVbglf
— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2022