Fire At Noida Building | బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి.. 50 కుటుంబాలను రక్షించిన ఫైర్ సిబ్బంది
Fire At Noida Building | ఛార్జింగ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ అంతా పొగలు కమ్ముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 50 కుటుంబాలకు చెందిన వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు.
లక్నో: ఛార్జింగ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ అంతా పొగలు కమ్ముకున్నాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 50 కుటుంబాలకు చెందిన వారిని కాపాడారు. (Fire At Noida Building) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సెక్టార్ 66లోని మమురా విలేజ్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని పార్కింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ పెడుతుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న పెట్రోల్ వాహనాలకు మంటలు అంటుకోవడంతో వేగంగా వ్యాపించాయి. భవనమంతా మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతోపాటు పాటు హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లు, రెస్క్యూ వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్ పై అంతస్తుల్లో చిక్కుకున్న సుమారు 50 కుటుంబాలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు దట్టమైన పొగలకు ఊపిరి అందక ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవన యజమానితో పాటు లీజుదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిల్డింగ్ పై అంతస్తుల్లోని కుటుంబాలను ఫైర్ సిబ్బంది రక్షించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Noida – Two people lost their lives after a fire, allegedly triggered by a short circuit in a scooter battery during charging, rapidly spread through a multi-storey building in Mamura. the battery malfunction ignited nearby vehicles parked in the building, with flames quickly… pic.twitter.com/PMmgKqMKE4
— NextMinute News (@nextminutenews7) July 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

