KU | కేయూలో జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ
కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 22న ‘వికసిత్ భారత్-2047లో అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్ర’పై నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్లు వీసీ కె.ప్రతాప్రెడ్డి ఆవిష్కరించారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 15: కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 22న ‘వికసిత్ భారత్-2047లో అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్ర’పై నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్లు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, కాన్ఫరెన్స్ కన్వీనర్ పసునూరి అమరావేణి మాట్లాడుతూ దేశాభివృద్ధి లక్ష్యాల సాధనలో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర, సమకాలీన ఆర్థిక సవాళ్లు, విధానపరమైన మార్పులు, స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థల ప్రాధాన్యత వంటి అంశాలపై ఈ సదస్సులో నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ బి.వెంకట్రామరెడ్డి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నరసింహచారి, బి.సురేష్లాల్, పి.వరలక్ష్మి, ఫణీంద్ర, గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

