Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఇవాళ బయటకు వస్తున్నారని, ఇది ఆప్‌తో పాటు ప్రజాస్వామ్యనికి గొప్ప దినమని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఈరోజు న్యాయం గెలించిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. తీహార్ జైలు నుంచి మరికాసేపట్లో కేజ్రీవాల్ విడుదల కానున్నారు.
కేజ్రీవాల్ విడుదలకు సంబంధించిన లాంఛనాలు పూర్తికావడంతో ఆయన ఏ క్షణమైనా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఆప్ శ్రేణులు పెద్దసంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీష్ సిసోడియా కేజ్రీవాల్‌ను స్వాగతించేందుకు జైలు వద్దకు చేరుకున్నారు. జైలు వద్దకు పెద్దసంఖ్యలో ఆప్ శ్రేణులు చేరుకోవడంతో అక్కడ కోలాహలం నెలకొంది. కేజ్రీవాల్‌ను స్వాగతిస్తూ ఆప్ కార్యకర్తలు తీహార్ జైలు వెలుపల బాణాసంచా పేలుళ్లతో హోరెత్తించారు.
మరోవైపు లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుతో 6 పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలకానున్నారు. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసుకు సంబంధించి పెదవివిప్పరాదని, కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
Read More :