Raghav Chadha | రాఘవ్ చద్దాపై ఆప్ మాటల దాడి.. బీజేపీతో చేతులు కలిపారన్న పంజాబ్ సీఎం భగవంత్ మన్
Raghav Chadha : రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. చద్దాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు.
Raghav Chadha : రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. చద్దాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఆయన బీజేపీతో చేతులు కలిపారని ఆరోపిస్తున్నారు. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దాను ఆ బాధ్యతల నుంచి ఆప్ తొలగించింది. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య మాటలయుద్ధం ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
తనను పదవి నుంచి తొలగించగలరేమో కానీ, ఓడించలేరని రాఘవ్ చద్దా అన్నారు. అయితే, ఆయనపై ఆప్ ఎదురుదాడికి దిగింది. పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా చద్దాపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో రాఘవ్ చద్దా చేతులు కలిపారని, ఇది ఆమ్ ఆద్మీ పార్టీలో ఆందోళన కలిగించిందని భగవంత్ మన్ అన్నారు. రాజ్యసభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆప్ సూచించే విషయాల్ని చద్దా పాటించలేదన్నారు. రాజ్యసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించమంటే, చద్దా మాత్రం సమోసాలపై ప్రశ్నించారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటుందన్నారు. మరో సీనియర్ ఆప్ లీడర్ సౌరభ్ భరద్వాజ్ కూడా రాఘవ్ చద్దాపై మండిపడ్డారు.
చద్దాకు వీలైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలని కోరారు. పంజాబ్, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చద్దా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాఘవ్ కొన్నేళ్లుగా భయపడుతున్నారని, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. సభలో మాట్లాడేందుకు దొరికే కొద్దిపాటి సమయంలో దేశం గురించి మాట్లాడాలని సూచించారు. చద్దా తీరుతో ఆప్ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- CM Bhagwant Mann
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

