Lucknow airport | ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో (Lucknow airport) భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కార్గో ప్రాంతంలో (cargo area) రేడియోధార్మిక పదార్థం (Radioactive material) కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం కార్గో ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ కన్సైన్మెంట్ను స్కాన్ చేస్తున్నప్పుడు రేడియోధార్మిక పదార్థాన్ని సిబ్బంది గుర్తించారు. క్యాన్సర్ మెడిసిన్స్ ఉన్న కన్టెయినింగ్ బాక్స్‌ను స్కానింగ్ చేస్తున్న సమయంలో అలారం మోగినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ఎన్డీఆర్ఎఫ్ను (NDRF) రంగంలోకి దింపినట్లు చెప్పారు. ఈ ఘటన కారణంగా విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఓ ప్రకటనలో వెల్లడించారు.
Also Read..
Sudan | సూడాన్‌లో మరోసారి రక్తపాతం.. పారామిలటరీ దళాల కాల్పుల్లో 80 మంది మృతి
Cloudburst | హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన రోడ్లు
Bridge Collapse | బీహార్‌లో మరోసారి కూలిన గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి