పూరి: ఒడిశాలోని ఫేమస్ పూరి జనగ్నాథ్ ఆలయం(Puri Jagannath Temple)లో నేటి నుంచి సంప్రదాయ డ్రెస్ కోడ్‌ను అమలు చేశారు. జగన్నాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులు హాఫ్ ప్యాంట్స్, షార్ట్స్, టోర్న్ జీన్స్, స్కిర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోరాదు. అలాంటి దుస్తుల్లో వచ్చే వారికి దర్శనం ఉండదని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. ఆలయ పరిసరాల్లో గుట్కా, పాన్ తినడంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్, పాలిథీన్ వాడకాన్ని కూడా నిలిపివేశారు.
ఇవాళ్టి నుంచి పూరి ఆలయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. దీంతో కొత్త సంవత్సరాది సందర్భంగా భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే ఎంట్రీ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 1.40 నిమిషాలకే ఆలయాన్ని తెరిచారు. ఆలయం ముందు ఉన్నగ్రాండ్ రోడ్డు వరకు భక్తులు క్యూ కట్టారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకే సుమారు రెండు లక్షల మంది భక్తులు జగన్నాథుడి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.