చండీగఢ్: ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ పాక్ అధికారికి భారత సైన్యానికి సంబంధించిన సమాచారం చేర వేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఒక అనుమానితుడు భారత సైన్యం కదలికల సమాచారాన్ని పాక్‌లోని హ్యాండ్లర్కు(బాధ్యుడికి) చేర వేస్తున్నట్టు తెలుసుకొని అతడిని అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు.
అతడిని విచారించగా మరొకరిని కూడా కస్టడీలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. నిందితుడు తాను సమాచారం చేర వేసినందుకు ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లింపులు పొందాడని డీజీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.