న్యూఢిల్లీ: లోక్‌సభ సీట్ల గురించి డీలిమిటేషన్(Delimitation) చేపట్టనున్న నేపథ్యంలో ఆ ప్రక్రియపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత, చండీఘడ్ ఎంపీ మనీష్ తివారీ కీలక ఆరోపణలు చేశారు. డీలిమిటేషన్‌తో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు.. లోక్‌సభ సీట్లను కోల్పోనున్నట్లు తెలిపారు. ఒకవేళ జనాభా ఆధారంగా కొత్తగా లోక్‌సభ స్థానాలను విభజిస్తే, అప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు నష్టం జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. తాజా జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే, దక్షిణాది రాష్ట్రాలే కాదు.. ఉత్తరాదిలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం పంజాబ్‌లో 13, హర్యానాలో 10 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఒకవేళ కొత్తగా డీలిమిటేషన్ చేపడితే, అప్పుడు ఆ సీట్ల సంఖ్య 18కి తగ్గిపోతుందని మనీష్ తివారీ తెలిపారు. అయితే జనాభా నియంత్రణ లేని సెంట్రల్ ఇండియా రాష్ట్రాలు మాత్రమే కొత్త డీలిమిటేషన్ ప్రక్రియతో లాభం పొందుతాయని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ సీట్ల సంఖ్య తగ్గితే అప్పుడు పరిస్థితి గందరగోళంగా ఉంటుందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సీట్ల పంపకం ఎలా జరుగుతుందో చెప్పడం కష్టమే అన్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు డీలిమిటేషన్‌ను అంగీకరిస్తాయా లేదా అన్న అంశం డౌట్‌గా ఉందన్నారు.
డీలిమిటేషన్‌ను కొత్త ఫార్ములా కనుగొనాలని, లేదంటే ఆ ప్రక్రియను నిలిపివేయాలని మనీష్ తివారీ అభిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలని ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన అభ్యర్థనకు చెందిన వార్తను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారాయన.
If DELIMITATION is held on the current principles of one Citizen, one vote and one value then not only the South even North India would also loose as the share of the Northern states as % share of the total strength of the Lok Sabha and even Rajya Sabha will go down further.… pic.twitter.com/I6i6wFxKFt
— Manish Tewari (@ManishTewari) March 6, 2025