హోషియార్పూర్: కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ (సవరణ) ముసాయిదా బిల్లును రైతులు వ్యతిరేకిస్తున్నారు.