చండీగడ్/అహ్మదాబాద్, మే 17: పంజాబ్‌లో సీఎం భగమంత్మాన్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనబాట పట్టారు.
వరినాట్లు ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌పై నిరసన, గోధుమ పంటకు బోనస్, స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా, పలు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాది రైతులు ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా చండీగఢ్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు.