కేంద్రంపై పోరు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించ తలబెట్టిన దేశవ్యాప్త నిరసనలకు రైతులు, కార్మికులు సిద్ధమయ్యారు. అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్ల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నారు.
- నేటి నుంచి మూడ్రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు
- సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
- అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్ల ముందు నిరసనలు
- రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం
- హామీల అమలులో బీజేపీ మోసంపై రైతన్నల కన్నెర్ర
న్యూఢిల్లీ, నవంబర్ 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించ తలబెట్టిన దేశవ్యాప్త నిరసనలకు రైతులు, కార్మికులు సిద్ధమయ్యారు. అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్ల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ర్టాల్లో రైతు, కార్మిక సంఘాలు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేశాయి. పలు ప్రాంతాల్లో సభలు, జాతాలు నిర్వహించి మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేపట్టాయి. పంజాబ్‌లో వేలాది మంది రైతులు శనివారం ఉదయం ట్రాక్టర్ ట్రాలీలు, మినీ బస్సులు సహా 3 వేలకు పైగా వాహనాల్లో ఛండీగఢ్‌కు తరలివెళ్లారు. ఆదివారం ఉదయం ఐఐఎస్ఈఆర్ చౌక్ నుంచి రాజ్‌భవన్‌కు మార్చ్ చేపడుతామని రైతు నేతలు వెల్లడించారు. సాగు చట్టాలను రద్దు చేసి రెండేండ్లు అవుతున్నా.. ఆ సమయంలో ఇచ్చిన హామీలను మోదీ సర్కార్ ఇప్పటికీ అమలు చేయలేదని ఎస్కేఎం నేత దర్శన్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం
మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం విరమణ సమయంలో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో సహా ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయడంలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎస్కేఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020లో జరిగిన ‘చలో ఢిల్లీ’ ఆందోళనలను గుర్తుచేయడంతో పాటు మోదీ సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకు ఆందోళనలు చేపడుతున్నట్టు పేర్కొన్నది. బీజేపీ పాలనలో దేశ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని విమర్శించింది. రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరలను కూడా పొందలేకపోతున్నారని పేర్కొన్నది. నష్టాలు, అప్పుల కారణంగా పంట పెట్టుబడికి తెచ్చిన రుణాలను తిరిగి కట్టలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రారంభమయ్యే ఆందోళనల్లో భాగంగా అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్లు, ఇతర ప్రాంతాల్లో రైతులు, కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు.
2020లో ఇదే రోజున ఢిల్లీలో..
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020లో కూడా ఇదే నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఉద్యమం ప్రారంభమైంది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో దాదాపు 13 నెలల పాటు ఆందోళనలు కొనసాగాయి. ఉద్యమంలో దాదాపు 725 మంది అన్నదాతలు అమరులయ్యారు. ఉద్యమ తీవ్రత, ఒత్తిడికి తలొగ్గిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేస్తామని, రైతాంగం ఇతర డిమాండ్లను కూడా నెరవేరుస్తామని రైతులకు హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలను నెరవేర్చకుండా మోదీ సర్కార్ మోసం చేసిందని, కాలయాపన చేస్తున్నదని రైతు సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
ముఖ్యమైన డిమాండ్లు ఇవీ..
- కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. విత్తనాలు, ఎరువులపై రాయితీ పెంచాలి.
- రైతులకు రుణమాఫీ ప్రకటించాలి.
- ఉద్యమ సమయంలలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, అమర రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలి.
- పెట్రో, ఇతర నిత్యావసరాల ధరలను నియంత్రించాలి. ఆహారం, ఔషధాలు, వ్యవసాయ పరికరాలు వంటి వాటిపై జీఎస్టీ తొలగించాలి.
- నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలి.
- విద్యుత్తు సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలి. ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను పెట్టొద్దు.
- ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. అటవీ చట్టానికి సవరణలను ఉపసంహరించాలి.
- ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. వేతనాన్ని రోజుకు రూ.600 చేయాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

