Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అధిక బరువు కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. మరోవైపు బరువు తగ్గేందుకు రాత్రంతా వర్కవుట్స్ చేసిన ఫొగాట్ ఇవాళ డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు రెజ్లర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann).. వినేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చర్కీ దాద్రిలోని రెజ్లర్ ఇంటికి వెళ్లిన సీఎం.. అక్కడ వినేశ్ ఫొగాట్ మామ మహావీర్ ఫొగాట్ (Mahavir Phogat)ను కలిసి మాట్లాడారు.
#WATCH | Punjab CM Bhagwant Mann meets Indian wrestler Vinesh Phogat’s uncle Mahavir Phogat in Charkhi Dadri, Haryana
CM Mann says, “…such mistakes are happening on such a high level. Coaches and physiotherapists are paid in lakhs. Have they gone there for holidays?” pic.twitter.com/HssegHyHPU
— ANI (@ANI) August 7, 2024
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల పని. ఇప్పుడు నిర్ణయం వచ్చింది. దీనికి ఎవరు బాధ్యులు. ఈ సమస్యను కేంద్రం పరిష్కరించదా..? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయంపై ఐవోసీ ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇంత పెద్ద స్థాయి ఈవెంట్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వారంతా అక్కడికి ఎందుకు వెళ్లినట్లు.. సెలవుల కోసం వెళ్లారా..?’ అంటూ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. కానీ, ఆమెపై అనర్హత వేటు పడిన వెంటనే ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు’ అంటూ ధ్వజమెత్తారు.
Charkhi Dadri, Haryana | On Vinesh Phogat’s disqualification in the Paris Olympics, Punjab CM Bhagwant Mann says”…I don’t want to connect with this politics. But please tell me have the members of the Indian Olympic Association gone there on holiday? Indian Olympic Association… pic.twitter.com/Pw7NSW4WUJ
— ANI (@ANI) August 7, 2024
కాగా, రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే (Olympic disqualification). 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫొగాట్.. ఫైనల్‌కి ప్రవేశించింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో అంతా పతకం ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ గేమ్‌కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఫొగాట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేస్తోంది.
Also Read..
Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు.. లోక్‌సభలో ప్రకటన చేసిన కేంద్రం