గురువారం 02 జూలై 2020
National - Apr 29, 2020 , 16:29:55

పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు కర్ఫ్యూ పొడిగింపు

పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు కర్ఫ్యూ పొడిగింపు

పంజాబ్‌ : పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ నిర్ణయం వెలువరించారు. కాగా ప్రజలు అవసరాల నిమిత్తం ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకే బయటకు రావాలన్నారు. ఈ సమయాల్లో దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలులో భాగంగా పంజాబ్‌లో మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. వైరస్‌ విజృంభన నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నారు.  


logo