ముంబై: ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో సెల్పీ తీసుకుంటా జారి లోయలో పడింది. (Woman Falls Into Gorge) రక్షించమని కేకలు వేసింది. గమనించిన స్థానికులు హోంగార్డు సహాయంతో ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం పూణేకు చెందిన కొందరు వ్యక్తులు థోస్గఢ్ జలపాతాన్ని సందర్శించారు. అయితే పూణేలోని వార్జేకు చెందిన 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ, బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా జారిపోయింది. సుమారు వంద అడుగుల లోతైన లోయలో ఆమె పడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించారు. హోంగార్డు సహాయంతో ఆమెను రక్షించారు. తాడు సహాయంతో నస్రీన్‌ను పైకి తీసుకువచ్చారు. సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఆ మహిళను స్థానికులు కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Maharashtra #Satara के उनघर रोड की बोर्ने घाट में गिरी एक युवती के रेस्क्यू का सनसनीखेज़ वीडियो सामने आया..सेल्फी लेने के दौरान युवती का पैर फिसला और घाट में गिर गई..100 फीट गहरे घाट में गिरी युवती को रस्सी से रेस्क्यू कर बाहर निकाला गया..3 अगस्त शाम की घटना@indiatvnews pic.twitter.com/GXdDJmxmsm
— Atul singh (@atuljmd123) August 4, 2024