ISRO | పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతం.. సెప్టెంబర్‌లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం: ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ నెల 14న చంద్రయాన్‌లో భాగంగా ఎల్వీఎం-3 (LVM-3) రాకెట్‌ను జాబిల్లిపైకి పంపించింది.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ నెల 14న చంద్రయాన్‌లో భాగంగా ఎల్వీఎం-3 (LVM-3) రాకెట్‌ను జాబిల్లిపైకి పంపించింది. తాజాగా పీఎస్ఎల్వీ సీ-56 (PSLV-C56) రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో (Sriharikota) ఉన్న షార్ (SHAR) నుంచి పీఎస్ఎల్వీ- సీ56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను భూ కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్యం ఉపగ్రహ ప్రయోగం.
పీఎస్ఎల్వీ-సీ 56 ద్వారా సింగపూర్‌కు (Singapore) చెందిన 420 కిలోల బరువున్న 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఇందులో డీఎస్-సార్ (DS-SAR) ప్రధానమైన శాటిలైది. ఇది సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపిస్తుంది. తాజా ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ (ISRO Chairman Somanath) అభినందించారు.
సెప్టెంబర్‌లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం..
పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని సోమ్‌నాథ్ చెప్పారు. ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ చేర్చిందని వెల్లడించారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం ఉంటుందని తెలిపారు. గగన్‌యాన్, ఎస్ఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.
#WATCH | Andhra Pradesh: "Congratulations, PSLV-C56 carrying seven satellites including the primary satellite DS-SAR and 6 co-passenger satellites have been successfully placed in the right orbit," says ISRO chief S Somanath
(Source: ISRO) pic.twitter.com/zwQmZB2AQs
— ANI (@ANI) July 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DS-SAR
- ISRO
- ISRO Chairman
- LVM-3
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

