న్యూఢిల్లీ : కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర్పడే పరిస్థితి నెలకొంది.
పని ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, అవాస్తవ టార్గెట్లే బీఎల్ఓలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1,200 మంది ఓటర్లను కలిసేందుకు బీఎల్ఓలు ప్రయత్నించాల్సి ఉంటుంది.