ఇంఫాల్, మే 27: ఓ ప్రభుత్వ బస్సు బోర్డుపైన రాష్ట్రం పేరును దాచిపెట్టినందుకు మణిపూర్వ్యాప్తంగా మంగళవారం నిరసనలు ప్రజ్వరిల్లాయి. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీకి చెందిన విద్యార్థి విభాగం సభ్యులు ఇంఫాల్ జిల్లాలో ఆందోళనకు దిగారు. పశ్చిమ ఇంఫాల్‌లోని లంఫేల్పట్ వద్ద సర్వే ఆఫ్ ఇండియా, ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాలకు తాళాలు వేసి వాటిపై రాసి ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్షరాలపై బురద పూశారు.
20న ఉఖ్రుల్ జిల్లాలో షిరుయిలిలీ ఉత్సవానికి జర్నలిస్టులను తీసుకెళుతున్న ప్రభుత్వ బస్సుపై మణిపూర్ పేరును మరుగుపరచడంపై తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారు.