Kolkata | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనను నిరసిస్తూ ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్’ విద్యార్థి సంఘం మంగళవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్నా అభియాన్’ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు.
#WATCH | West Bengal: Protestors drag away Police barricades as they agitate over RG Kar Medical College and Hospital rape-murder case and carry out Nabanna Abhiyan’ march. Police resort to opening lathi charge and lobbying tear gas shells to disperse them.
Visuals from… pic.twitter.com/rAAcnBGzLr
— ANI (@ANI) August 27, 2024
అయితే, హౌరా బ్రిడ్జ్ వద్ద విద్యార్థులు బారికేడ్లను బద్దలు కొట్టారు. కొన్నింటిని చేతులతోనే లాగి పక్కకు పడేశారు. పోలీసులకుపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారులపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల నిరసనల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
#WATCH | West Bengal: Protests continue at Howrah Bridge, as part of ‘Nabanna Abhiyan’ march, over RG Kar Medical College and Hospital rape-murder case. pic.twitter.com/6K2zGKlHj5
— ANI (@ANI) August 27, 2024
విద్యార్థుల నిరసన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. హౌరాలోని రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను (Three Layer Security) ఏర్పాటు చేసింది. సుమారు 6,000 మందికిపైగా పోలీసులు నగర వ్యాప్తంగా మోహరించారు. ఐజీ, డీఐజీ స్థాయిలోని 21 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక భద్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, హౌరా సిటీ పోలీసులతోపాటు భారీ రేడియో ఫ్లయింగ్ స్వ్కాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్‌లు, డ్రోన్లు, వాటర్ ఫిరంగులను ఆ ప్రాంతంలో మోహరించారు. అదేవిధంగా నబన్న పరిసరాల్లో 19 పాయింట్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇతర కీలక ప్రదేశాల్లోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
#WATCH | West Bengal: Security personnel lob tear gas shells in a bid to disperse protestors from Howrah Bridge.
A ‘Nabanna Abhiyan’ march has been called today over RG Kar Medical College and Hospital rape-murder case. pic.twitter.com/zahuiJGDDM
— ANI (@ANI) August 27, 2024
#WATCH | West Bengal: Security personnel lathi charge and chase away protestors from Howrah Bridge.
A ‘Nabanna Abhiyan’ march has been called today over RG Kar Medical College and Hospital rape-murder case. pic.twitter.com/Slqsy4oLxa
— ANI (@ANI) August 27, 2024
Also Read..
Maharashtra | కోల్‌కతా ఘటన మరవకముందే.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం
Vande Bharat | సిమెంట్ స్లాబ్‌ను ఢీ కొట్టిన వందే భారత్ రైలు.. తప్పిన ప్రమాదం
MLC Kavita | ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. మంజూరు చేసిన సుప్రీంకోర్టు