IND vs NZ : వడోదరలో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ హెన్రీ నికోల్స్(62)ను ఔట్ చేసిన యువ పేసర్ హర్షిత్ రానా(2-34).. ఈసారి డెవాన్ కాన్వే(56)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అర్ధ శతకం బాది జోరు మీదున్న కాన్వే డ్రైవ్ చేయబోగా.. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. దాంతో. పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్ పడింది. ప్రస్తుతం విల్ యంగ్(8), డారిల్ మిచెల్(4) క్రీజులో ఉన్నారు. ఇద్దరు కుదురుకునేందుకు సమయం తీసుకుంటున్నారు. 25 ఓవర్లకు స్కోర్.. 133-2.
మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత పేసర్ హర్షిత్ రానా () విరుచుకుపడుతున్నాడు. సీనియర్లు సిరాజ్, రవీంద్ర జడేజాలు వికెట్ తీయడానికి ప్రయాస పడుతున్న చోట ఈ కుర్రాడు రెండు వికెట్లతో కివీస్‌ను దెబ్బ కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభమిచ్చిన ఓపెనర్ హెన్రీ నికోల్స్(62)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించాడీ ఈ స్పీడ్‌స్టర్. 24వ ఓవర్లో.. మళ్లీ ప్రత్యర్థికి షాకిస్తూ.. హాఫ్ సెంచరీ బాదిన డెవాన్ కాన్వే(56)ను ఊహించని బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో.. హర్షిత్ రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
One brings two for Harshit Rana and #TeamIndia!
New Zealand lose both their openers.
Updates ▶️ https://t.co/OcIPHEpvjr#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/gSzvDD40XU
— BCCI (@BCCI) January 11, 2026