Mana Shankara Varaprasad garu | చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రానికి ఒక్క గంటలోనే ఎన్ని టెకెట్స్ బుక్కయ్యాయో తెలుసా.. ?
Mana Shankara Varaprasad garu | చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad garu) రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిరు టీం. కాగా పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో మన శంకర వరప్రసాద్ గారు ట్రెండ్ కొనసాగుతోంది.
Mana Shankara Varaprasad garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిరు టీం. కాగా పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో మన శంకర వరప్రసాద్ గారు ట్రెండ్ కొనసాగుతోంది. బుక్ మై షోలో ఒక్క గంటలో 13 వేల టికెట్స్ బుకయ్యాయి. ఈ లెక్కన మన శంకర వర ప్రసాద్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉండబోతున్న నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది.
ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగతేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
#ManaShankaraVaraPrasadGaru is making waves at BookMyShow. The Megastar #Chiranjeevi film is trending on BMS with 13k tickets booked in just the last hour. With the premiere just hours away, #MSG is heating up the box office. #MSGonJan12th pic.twitter.com/Z6kZqEZK58
— BA Raju’s Team (@baraju_SuperHit) January 11, 2026
Read Also :
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

