Vande Bharat | సిమెంట్ స్లాబ్‌ను ఢీ కొట్టిన వందే భారత్ రైలు.. తప్పిన ప్రమాదం
Vande Bharat | జోధ్‌పూర్ (Jodhpur) వెళ్లే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైంది. పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్ (cement slab)ను ఢీ కొట్టింది.
Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది.. రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి వార్తలను తరచూ వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినడం, అద్దాలు ధ్వంసం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా జోధ్‌పూర్ (Jodhpur) వెళ్లే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైంది. పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్ (cement slab)ను ఢీ కొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23న రాజస్థాన్ (Rajasthan)లోని పాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న రైలు పాలి జిల్లాలో సుమెర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవాయి-బిరోలియా సెక్షన్ మధ్య పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాదం కారణంగా రైలు కొంత ఆలస్యంగా గమ్య స్థానానికి చేరినట్లు నార్త్ వెస్ట్ సీపీఆర్వో శశికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫల్నా ప్రాంతానికి చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌పై ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్ స్లాబ్ ముక్కలు కనిపించినట్లు తెలిపారు.
అహ్మదాబాద్ – జోధ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. సబర్మతి స్టేషన్ నుండి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు జోధ్‌పూర్ చేరుకుంటుంది.
Also Read..
Kolkata | సచివాలయం ముట్టడికి విద్యార్థుల పిలుపు.. కోల్‌కతాలో భారీగా మోహరించిన పోలీసులు
Klin Kaara | కృష్ణుడి పూజలో క్లీంకారా.. ఫొటో షేర్ చేసిన ఉపాసన
Harish Rao | టీచర్లు లేక మూతపడుతున్న పాఠశాలలు .. పాలకులు సిగ్గుతో తల దించుకోవాలి: హరీశ్‌రావు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

