న్యూఢిల్లీ, జూలై 30: మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్నట్టు పేర్కొన్నది. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు వెల్లడించింది.
మరోవైపు మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం మార్గం కనుగొనాలని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత అరుణ్ రాయ్ సూచించారు. మణిపూర్ ‘నగ్న’ ఊరేగింపు బాధితులకు మద్దతుగా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆదివారం పలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.