Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన పంజాబ్ అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple)పై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ (Operation Blue Star) పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 41 ఏళ్లు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇదేరోజున జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే చనిపోయాడు. ఈ సందర్భంగా స్వర్ణదేవాలయం (Amritsar Godlen Temple)లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. కార్యక్రమంలో కొందరు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వర్ణ దేవాలయంలో SAD (మన్ వర్గం) నాయకుడు సిమ్రంజిత్ సింగ్ మాన్ సిక్కుల పవిత్ర స్థలానికి చేరుకోగానే.. ఆయన అనుచరులు ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Amritsar, Punjab: People raise slogans of ‘Khalistan zindabad’ as SAD (Mann faction) leader Simranjit Singh Mann reaches the Golden Temple on the 41st anniversary of Operation Blue Star and also the death anniversary of Jarnail Singh Bhindranwale, who was killed during… pic.twitter.com/f0kmGBa1le
— ANI (@ANI) June 6, 2025
1984, జూన్ 1 నుంచి 8 మధ్య ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ప్రత్యేక ఖలిస్థాన్ డిమాండ్ చేస్తూ గోల్డెన్ టెంపుల్లో తలదాచుకున్న సిక్కు ఉగ్రవాదులను ఏరివేయాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్మీని ఆదేశించారు. దానికే ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అనే పేరు పెట్టారు. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 41 ఏళ్లు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ సైనిక చర్యలో సుమారు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read..
Reserve Bank of India: రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
PM Modi | పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌కు ప్రధాని.. భద్రత కట్టుదిట్టం
Fixed Deposits: ఎఫ్‌డీల నుంచి 4 కోట్లు కాజేసిన బ్యాంకు మేనేజర్.. ఆ స్టోరీ తెలుసుకోవాల్సిందే