PM Modi | కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) చీనాబ్ బ్రిడ్జ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని తొలిసారి జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
#WATCH | J&K: Prime Minister Narendra Modi will inaugurate the Chenab Rail Bridge and visit the bridge deck today.
The Chenab Rail Bridge, situated at a height of 359 meters above the river, is the world’s highest railway arch bridge. It is a 1,315-metre-long steel arch bridge… pic.twitter.com/tIIKBvA95O
— ANI (@ANI) June 6, 2025
చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.
#WATCH | J&K: Security tightened at Sangaldan Railway Station in Ramban ahead of PM Narendra Modi’s visit to the UT.
Prime Minister will inaugurate the Chenab bridge and visit the bridge deck this morning. Thereafter, he will visit and inaugurate the Anji bridge. He will flag… pic.twitter.com/jsh6z2ThlP
— ANI (@ANI) June 6, 2025
Also Read..
Fixed Deposits: ఎఫ్‌డీల నుంచి 4 కోట్లు కాజేసిన బ్యాంకు మేనేజర్.. ఆ స్టోరీ తెలుసుకోవాల్సిందే
Corona Virus | దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55కి పెరిగిన మరణాలు