ముంబై: గృహ, వాహన రుణాలు తీసుకున్నవారికి భారీ ఊరట కల్పించింది ఆర్బీఐ(Reserve Bank of India). వరుసగా రెండోసారి రెపో రేటును రిజర్వ్ బ్యాంకు తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఇవాళ ఆర్బీఐ ప్రకటన చేసింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ మీడియాతో వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను తగ్గినట్లు చెప్పారు.
రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆరుగురు సభ్యులున్న ఎంపీసీ మీటింగ్ మూడు రోజుల పాటు సాగింది. రెపో రేటను తగ్గించే అంశంపై ఎంపీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఏప్రిల్లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో 6.25 శాతంగా ఉన్న రేటును 6 శాతానికి తీసుకువచ్చారు.
मौद्रिक नीति वक्तव्य, 2025-26
मौद्रिक नीति समिति (एमपीसी) का संकल्प
4-6 जून 2025
Monetary Policy Statement, 2025-26 Resolution of the Monetary Policy Committee June 4 to 6, 2025@GovSMalhotra#rbigovernor #monetarypolicy #rbitodayhttps://t.co/yLDvGCXLMd— ReserveBankOfIndia (@RBI) June 6, 2025