తిరువనంతపురం, నవంబర్ 23: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 4.1 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సోదరుడు రాహుల్‌గాంధీ వయనాడ్‌లో సాధించిన మెజార్టీ మార్క్‌ను ఆమె తిరగరాశారు. వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ 6,22,338 ఓట్లు సాధించినట్టు శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది.
కేరళలో అధికార ఎల్డీఎఫ్ తరఫున బరిలో దిగిన సీపీఎం అభ్యర్థి సత్యన్ మోకిరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ రెండు, మూడో స్థానంలో నిలిచారు. మోకిరికి 2,11,407 ఓట్లు, హరిదాస్‌కు 1,09,939 ఓట్లు వచ్చాయి. వయనాడ్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతాననిఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి 3,64,422 ఓట్ల మెజార్టీ రాగా, ఈసారి ప్రియాంక గాంధీ 4,10,931కి మెజార్టీ అందుకోవటం గమనార్హం.