UP Polls | యూపీ పోరులో దీటుగా పోరాడాం..ఫలితాల కోసం వేచిచూస్తున్నాం : ప్రియాంక గాంధీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో తాము శక్తివంచన లేకుండా పోరాడామని, తాము ఎన్నికల ఫలితాల కోసం వేచిచూస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు.
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో తాము శక్తివంచన లేకుండా పోరాడామని, తాము ఎన్నికల ఫలితాల కోసం వేచిచూస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత ప్రధానంగా ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని ముందుండి నడిపించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను మహిళా అభ్యర్ధులకు కేటాయిస్తామని ప్రకటించడంతో 403 స్ధానాలకు గాను 159 మంది మహిళా అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలో దింపింది.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్నోలో కాంగ్రెస్ పార్టీ తమ స్లోగన్ లడ్కీ హూ..లడ్శక్తీ హూ..పేరిట భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ పార్టీ తరపున బరిలో నిలిచిన 159 మంది మహిళా అభ్యర్ధులకు ఇది వేడుక వంటిదని..తామంతా ఎన్నికల్లో పోరాడామని వారితో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ పాల్గొన్నారు. కాగా యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా ఎస్పీ రెండవ స్ధానంలో నిలుస్తుందని, 2017లో సాధించిన ఫలితాలనే కాంగ్రెస్ పునరావృతం చేస్తుందని పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ యూపీలో మొత్తం 403 స్ధానాల్లో పోటీ చేయడం మూడు దశాబ్ధాల తర్వాత ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

