న్యూఢిల్లీ : ప్రైవేట్ సంస్థలు తమ సేవల బట్వాడా కోసం ఆధార్ అథెంటికేషన్‌ను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం ఆధార్ చట్టాన్ని సవరించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. ఆధార్ ఆథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) అమెండ్మెంట్ రూల్స్, 2025ను నోటిఫై చేసింది.
ఈ సదుపాయం కోసం ప్రైవేట్ సంస్థలు ప్రతిపాదనను పంపిస్తే, దానిని ప్రభుత్వ శాఖల ఆమోదం మేరకు ఆధార్ అథెంటికేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు. ప్రైవేట్ సంస్థల ప్రతిపాదనలను మొదట యూఏడీఏఐ పరిశీలిస్తుంది. యూఐడీఏఐ సిఫారసు మేరకు ఆ ప్రైవేటు సంస్థ ఆధార్ అథెంటికేషన్‌ను ఉపయోగించుకోవడానికి ఐటీశాఖ ఆమోదం తెలుపుతుంది.