VB-G RAM G Bill : మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ గ్రామ్ బిల్లు (VB-G RAM G Bill) 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోదం తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ సంకల్పించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామిన్) బిల్లుపై ఆదివారం ముర్ము సంతకం చేశారు. దాంతో.. దాంతో.. దాదాపు ఇరవై ఏళ్లుగా కరువు పనిగా కొనసాగుతున్న ఎంజీనరేగా (MGNAREGA) చట్టం కనుమరుగవ్వనుంది.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పలు సంస్కరణలకు రూపమిస్తున్న మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొత్త పేరుతో కొనసాగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 100 రోజులు ఉపాధి కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే.. మోడీ ప్రభుత్వం ఈ పథకం నుంచి గాంధీ పేరున తొలగించాలనే ఉద్దేశంతో కొత్త చట్టంతో వస్తోంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామిన్) బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం. ఆదివారం ఆ బిల్లుపై ప్రెసిడెంట్ సంతకం చేశారు.
President Droupadi Murmu gives assent to Viksit Bharat–Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin) Bill, 2025
Read @ANI Story | https://t.co/4EJnvqvfeu#DroupadiMurmu #VBGRAMGBill #Parliament pic.twitter.com/2vfUsZ5dwo
— ANI Digital (@ani_digital) December 21, 2025
ఈ కొత్త స్కీమ్‌లో పని దినాలతో పాటు వేతనం కూడా పెంచిన విషయం తెలిసిందే. ఇదివరకూ 100 రోజులున్న పని దినాలను 125కు, కనీన వేతనాన్ని కూడా రూ.240కి పెంచారు. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లోనూ కీలక మార్పులు చేశారు. ఇంతకుముందు హిహాలయ పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఈ వాటా 90:10గా ఇతర రాష్ట్రాల్లో 75:25గా ఉండేది. ఇకనుంచి కేంద్ర, రాష్ట్రాలు ఖర్చులను 60:40 శాతంలో భరించనున్నాయి.