PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి (Mahasamadhi)ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయిబాబాపై రూపొందించిన రూ.100 నాణేన్ని, తపాల బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచ్చేస్తారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి, 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారు.
అంతకుముందు సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. గతంలో సత్యసాయి బాబాను కలిసిన దృశ్యాలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి, ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి. మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి అని మోదీ పేర్కొన్నారు.
Also Read..
TTD | టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ. 2 కోట్ల విరాళం..
PM Modi | సత్యసాయి బాబా జీవితం తరతరాలకు మార్గదర్శకం : ప్రధాని మోదీ
Puttaparthi | పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. హాజరైన సచిన్, ఐశ్వర్యరాయ్