వారణాసి: బాబా కాలభైరవుడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చారు. ఇవాళ కాశీలో పర్యటిస్తున్న ఆయన.. మొదట కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాలభైరవుడికి పూజ, అర్చన చేశారు. దీనిలో భాగంగా కాలభైరవుడికి హారతి ఇచ్చారు. మోదీని కలిసేందుకు భారీ సంఖ్యలో జనం ఆ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఉన్న భక్తులతో కాసేపు ప్రధాని మోదీ గడిపారు. వారికి అభివాదం చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 244 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ పునర్ నిర్మాణం జరుగుతోంది.
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Kaal Bhairav temple in Varanasi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
Later, he will offer prayers at Kashi Vishwanath temple inaugurate phase 1 of Kashi Vishwanath Corridor
(Source: DD) pic.twitter.com/ZmO1AG08uC
#WATCH | People greet Prime Minister Narendra Modi in his parliamentary constituency Varanasi, Uttar Pradesh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
(Source: DD) pic.twitter.com/mQkmpdSZ5Z