PM Modi : ప్రముఖ యోగా గురు స్వామి శివానంద (Swami Sivananda) మృతిపట్ల ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. స్వామి ఆధ్యాత్మిక సాధన, యోగా రంగానికి ఆయన చేసిన అసమానమైన కృషి తరతరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
యోగా ద్వారా ఆయన చేసిన సమాజసేవకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారని ఆయన గుర్తుచేశారు. స్వామీజీ మృతి యోగా రంగానికి తీరని లోటని చెప్పారు. స్వామీజీకి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్వామీజీ మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.